రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఎప్పుడూ తన సినిమాలతో తాను బిజీగా ఉంటూ.. వివాదాలకు దూరంగా ఉండే సాయి ఇలా ఉన్నఫలంగా ప్రమాదానికి గురి కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన బాగానే ఉన్నాడు.. త్వరలోనే మళ్లీ మన ముందుకొస్తాడని వైద్యులు చెప్తున్నారు.
తిండి మానేసి సాయి కోసమే వేచి చూస్తున్నారు. ఆయన బాగుండాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఆయన లాంటి మంచి వాళ్లకు దేవుడు చెడు చేయడు అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. పైగా ఆశ్రమ వాసులతో సాయి ధరమ్ తేజ్‌కు కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది. విజయవాడ వెళ్లిన ప్రతీసారి అక్కడికి వెళ్లి సమయం గడుపుతుంటాడు. ఎలాంటి దిక్కుమొక్కు లేని చాలా మందికి ఈయనే ఆశ్రమంతో నీడనిచ్చాడు.