Vaarasudue Box Office తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Varasudu) పేరుతో డబ్ అయ్యింది. దిల్ రాజు నిర్మాత, రష్మిక మందన్న హీరోయిన్.. మంచి అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 14న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. వారిసు సినిమా తమిళంలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తెలుగులో యావరేజ్‌గా నిలిచింది. (Twitter/Photo)
మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Vaarasudu)గా డబ్ అయ్యింది. విజయ్ కెరీర్లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. కన్నడ అందం రష్మిక మందన్న హీరోయిన్గా ( Rashmika Mandanna) చేసింది. Photo : Twitter
ఇక ఈ వారిసు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వారిసు టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. విజయ్ గతంలో బిగిల్ చిత్రంతో 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాడు. వారిసు తెలుగులో వారసుడు సంక్రాంతి పండుగకు విడుదలై భారీ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాను తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. Photo : Twitter
ఇక తమిళంలో జనవరి 11న విడుదలైన ఈ సినిమా.. తెలుగులో భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. సినిమా విజువల్‌గా గ్రాండియర్‌గా తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో ఏమోషన్స్, యాక్షన్ సమపాళ్లలో తెరకెక్కించాడు. కథ విషయానికి వస్తే.. శరత్‌కుమార్ విజయ్‌కు తండ్రిగా నటించారు. అతని అన్నలులుగా శ్రీకాంత్, కిక్ శ్యామ్ నటించారు. . ఒక పెద్ద కుటుంబం.. ముగ్గురు అన్నదమ్ములు స్టోరీ. Photo : Twitter
ఈ సినిమా ఏరియా వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే. తెలంగాణ (నైజాం)లోరూ. 5.40కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2.35 కోట్లు . ఉత్తరాంధ్ర.. రూ. 2.33 కోట్లు .. తూర్పు గోదావరి.. రూ. 1.08 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 0.82 కోట్లు .. గుంటూరు..రూ. 0.99 కోట్లు .. కృష్ణ.. రూ. 1.01 కోట్లు నెల్లూరు .. రూ. 0.69 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి 19 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 14.67 కోట్లు షేర్ (రూ. 26.50 కోట్లు గ్రాస్) వసూళ్లు చేసింది. (Twitter/Photo)
ఇక ఈ సినిమా తెలుగులో రూ. 15 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సంక్రాంతి బరిలోకి దిగింది. ఈ ఇంకా రూ. 33 లక్షల షేర్‌ను వసూలు చేస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకనే అవకాశం ఉంది. ఓ వైపు వాల్తేరు వీరయ్య, మరోవైపు వీరసింహారెడ్డి సినిమాలు ఉన్నా.. ఈ రేంజ్ వసూళ్లు సాధించడం మామలు విషయం కాదనే చెప్పాలి. పైగా నెగిటివ్ టాక్‌తో ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం కూడా మంచి పరిణామనే చెప్పాలి. ఇకవారసుడు సినిమా బాగున్నప్పటికీ ... ఈ కంటెంట్ తెలుగులో ఇప్పటికే చాలా సార్లు రావడం ఒక కారణం అవ్వగా.. విజయ్‌కు తెలుగులో అంతగా పాపులారిటీ లేకపోవడం కూడా ఓ కారణం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగులో హిట్ స్టేటస్‌కు కాస్త దూరంలో ఉంది. Photo : Twitter
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. తమిళనాడు - రూ. 125.60 కోట్లు గ్రాస్.. తెలుగు రాష్ట్రాలు.. రూ. 27 కోట్లు.. కర్నాటక .. రూ. 14.30 కోట్లు గ్రాస్.. కేరళలో రూ. 11.85 కోట్లు.. రెస్టాఫ్ భారత్ - రూ. 14.00 కోట్ల గ్రాస్.. ఓవర్సీస్ -- రూ. 83.25 కోట్ల గ్రాస్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 276 కోట్ల గ్రాస్.. (రూ. 140.80 కోట్ల షేర్ ) సాధించింది. ఈ సినిమా రూ. 137.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 139 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది.రూ. 1.8 కోట్ల లాభంతో విడుదలైన 19 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకోవడం విశేషం. (Twitter/Photo)
ఈ సినిమాలోన పవర్ సీటులో కాదు, దాంట్లో కూర్చోనే వాడిలో ఉంటుందనే డైలాగ్ మంచి ఆదరణ పొందుతోంది. అన్ని కమర్షియల్ హంగులతో సినిమాను రూపోందించారు. ఇక ఈ సినిమాలో విజయ్‌తో పాటు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రష్మిక మందన్న, జయసుధ, ప్రభు, సంగీత కీలకపాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. Photo : Twitter
ఇక ఇక్కడ మరో విశేషం ఏమంటే.. ఈ సినిమా కోసం దళపతి విజయ్ 100 కోట్లకు (Vijay Remuneration For Varasudu Movie) పైగా రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. విజయ్ తన గత సినిమా విజిల్ కోసం వాడు దాదాపుగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో టాక్ నడిచిన సంగతి తెలిసిందే. Photo : Twitter