కొన్ని రోజులు క్రితం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి విజయ్ సేతుపతి పై ఎగిరి తన్నిన సంగతి తెలిసిందే కదా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత సదరు వ్యక్తి మహా గాంధీ విజయ్ సేతుపతికి సారీ చెప్పాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ గొడవ సద్దుమణిగందని అందరు అనుకుంటుండగా.. హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ ఓ ప్రకటన చేసింది. (Twitter/Photo)
విజయ్ సేతుపతిని ఒక్కసారి తంతే వాళ్లకు రూ. 1001 రూపాయల నగదు రివార్డు ఇస్తామన్నారు. సదురు విజయ్ సేతుపతి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పేవరకు తన్నాలని అర్జున్ సంపత్ చెప్పారు. ఇక విజయ్ సేతుపతిని బెంగుళూరులో తన్నిన వ్యక్తి మహా గాంధీతో తాను మాట్లాడనని అర్జున్ సంపత్ పేర్కొన్నారు. అతనితో విజయ్ సేతుపతి చులకనగా మాట్లాడటంతో అతను విజయ్ సేతుపతిని తన్నినట్లు చెప్పుకొచ్చారు. (Twitter/Photo)