తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. వరుణ్ 'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 'సన్ పిక్చర్స్' బ్యానర్ పై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజ్ భారీ ధర పెట్టి కొన్నారు. అయితే సినిమా సరిగా ఆకట్టుకోకపోవడంతో నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. Photo : Twitter
బీస్ట్ నైజాం 2.45 కోట్లు, సీడెడ్‌లో 1.10 కోట్లు, ఉత్తరాంధ్ర 0.90 కోట్లు, ఈస్ట్ 0.63 కోట్లు, వెస్ట్ 0.62 కోట్లు, గుంటూరు 0.80 కోట్లు, కృష్ణా 0.52 కోట్లు, నెల్లూరు 0.40 కోట్లు వసూలు అయ్యాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణలో చూస్తే.. బీస్ట్‌కు 7.42 కోట్లు వసూలు అయ్యాయి. అయితే 'బీస్ట్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.11 కోట్ల షేర్‌ను రాబట్టాల్సింది. కాగా ఫుల్ రన్ ముగిసేసరికి ఈ బీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో రూ.7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బీస్ట్ ఇక్కడి నిర్మాతలకు దాదాపుగా రూ.3.26 కోట్ల నష్టాలను మిగిల్చిందని అంటున్నారు. Photo : Twitter
Vijay-Pooja Hegde | Beast Telugu : తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Photo : Twitter
ఇక యాక్షన్-థ్రిల్లర్‌గా వచ్చిన బీస్ట్ విషయానికి వస్తే.. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ భారీగా నిర్మించింది. పూజాహెగ్డే హీరోయిన్గా చేశారు. ఇక అది అలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బీస్ట్ అనుకున్నంతగా లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దర్శకుడు అభిమానులకు డిస్సాప్పాంట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. చెన్నైలో కొందరు అభిమానులు ఏకంగా సినిమా బాగాలేదని థియేటర్‌ను తగలబెట్టే ప్రయత్నం చేశారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై అప్పుడే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT హక్కులు SunNxt, ఇంకా Netflix వద్ద ఉన్నాయి. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలనేది ఒప్పందం. అయితే బీస్ట్ అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ముందే రావోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.
దీంతో ఆయన తాజాగా సినిమా బీస్ట్‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే తెలుగులో బీస్ట్‌కు విజయ్ కెరీర్ లోనే రికార్డు ఫిగర్ కి థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ 11 కోట్లకు అమ్ముడు అయ్యినట్లు టాక్ నడుస్తోంది. ఇక బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల అవ్వడంతో.. బాక్సాఫీస్ దగ్గర కెజియఫ్‌తో పోటీ పడాల్సి వచ్చింది. Photo : Twitter
ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ‘జాలీ ఓ జింఖానా’ (Jolly O Gymkhana) అనే టైటిల్‌తో విడుదలైన ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కూ కార్తిక్ రాసిన ఈ పాటను ఈ సినిమా హీరో (Thalapathy Vijay) విజయ్ స్వయంగా పాడారు. ఇక ఇప్పటికే బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్గా చేస్తున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే... గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు నెల్సన్. ఈ సినిమా కంటే ముందు నయనతారతో చేసిన కోకో సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ హీరోగా సినిమా చేసే అవకాశం అందుకున్నారు. త్వరలోనే ఈయన రజనీకాంత్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. Photo : Twitter