తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. ఇపుడు బీస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విజయ్ తరహాలో ‘RAW’ ఏజెంట్ పాత్రలో నటించిన ఇతర హీరోలు నటించిన సినిమాల విషయానికొస్తే.. . (Beast Telugu Photo : Twitter)
Nagarjuna As Ghost : నాగార్జున గతేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాలో NIA అధికారి పాత్రలో కనిపించాడు. ఇపుడు రాబోయే ప్రవీణ్ సత్తారు సినిమా ‘ది ఘోస్ట్’ సినిమాలో ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగు తెరపై ఇప్పటి వరకు రానీ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దుబాయ్ ఎడారిలో నాగార్జున పై ప్రవీణ్ సత్తారు హై ఓల్టెజ్ యాక్షన్ సీన్స్ పిక్చరైజ్ చేసారు. (Twitter/Photo)
Akhil Akkineni As Agent | అక్కినేని అఖిల్ ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్లో కనిపించున్నాడు. ‘ఏజెంట్’ సినిమాలో గూఢచారి పాత్ర కోసం అఖిల్ అక్కినేని పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యాడు. గడ్డం చిరిగిన జుట్లుతో సిక్స్ బ్యాక్ బ్యాడీతో అఖిల్ ఆహార్యం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా ఆగష్టు 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (Twitter/Photo)
ఈ రకంగా అక్కినేని తండ్రీ తనయులైన వీళ్లిద్దరు ఒకే తరహా పాత్రలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవ్వడం చూసి అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక గత కొన్నేళ్లుగా ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ హీరోలకు హిట్స్‌తో ఫామ్‌లోకి రావడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.దీంతో వీరి నుంచి రాబోయే చిత్రాలపై ఆసక్తి నెలకొంది. (Nagarjuna Akhil)
డెవిల్ | అటు నందమూరి కళ్యాణ్ రామ్.. స్వాతంత్య్రపు పూర్వపు స్టోరీతో చరిత్రలో మరుగున పడిన బ్రిటిష్ సీక్రెట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ రామ్ తొలిసారి జేమ్స్‌బాండ్ తరహా సీక్రెట్ పాత్రలో తొలిసారి నటిస్తుండంతో ఈ సినిమాపై అపుడే అంచనాలు మొదలయ్యాయి.(Twitter/Photo)
‘విశ్వరూపం’ సినిమాలో కమల్...భారత్ జేమ్స్‌బాండ్ గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. 60 యేళ్ల పై పడ్డ వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా విడుదలైన ‘విశ్వరూపం2’ మాత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది. గతంలో కమల్ హాసన్ కొన్ని సినిమాల్లో జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో నటించారు. (Twitter/Photo)