Lokesh Kanagaraj: ‘మాస్టర్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు కరోనా పాజిటివ్..
Lokesh Kanagaraj: ‘మాస్టర్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు కరోనా పాజిటివ్..
Lokesh Kanagaraj: వరస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సెన్సేషన్‌గా మారిపోయిన లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj)కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అనౌన్స్ చేసాడు లోకేష్.
వరస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా సంచలనాలు నమోదు చేస్తున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ మధ్యే విజయ్ హీరోగా ‘మాస్టర్’ సినిమాతో మరో విజయం అందుకున్నాడు ఈయన. వరసగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ పూర్తి చేసాడు లోకేష్.
2/ 6
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ దర్శకులలో ఈయన కూడా ఉన్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమా చేస్తున్నాడు లోకేష్. ఈ మధ్యే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది.
3/ 6
ప్రస్తుతం ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నాడు లోకేష్ కనకరాజ్. ఒక్క టీజర్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించబోతున్నాడు లోకేష్ కనకరాజ్.
4/ 6
తాజాగా ఈ దర్శకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే వెళ్లి పరీక్ష చేయించుకున్నానని.. దాంతో పాజిటివ్ వచ్చిందని చెప్పాడు లోకేష్. దీంతో ఆయన వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు.
5/ 6
ఈ విషయాన్ని తానే స్వయంగా అభిమానులతో వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన పరిస్థితి బాగానే ఉందని.. డాక్టర్లు మంచి కేర్ తీసుకుంటున్నారని తెలిపాడు లోకేష్ కనకరాజ్. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తానని చెప్పాడు ఈయన.
6/ 6
ప్యాండమిక్ తర్వాత ఇండియాలో విడుదలైన తొలి భారీ సినిమా మాస్టర్. దీనికి దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా ఈయనకు కరోనా అని సోకడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. వచ్చిన తర్వాత విక్రమ్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు లోకేష్.