తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో నిర్మాణమై, విడుదలైన ఈ చిత్రానికి ఏకంగా రూ.125 కోట్లు ఖర్చు చేశారు. అయితే లాభాలు రాకపోగా పెట్టుబడిని కూడా తిరిగి పొందడంలో లైగర్ ఘోరంగా విఫలమైంది. ఇంతలో ఫెమాను ఉల్లంఘించి విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులతో లైగర్ చిత్రాన్ని నిర్మించారని ఆరోపణలు వచ్చాయి.