కొద్ది రోజుల క్రితమే గోవాలో ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీకి సంబంధించి ప్రస్తుతం ఓ పాటకు సంబంధించిన షూట్ జరుపుతున్నారని సమాచారం. దీంతో ఈ మూవీ షూటింగ్ పార్ట్ అంతా ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది.
ఆగస్టు 25న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం పక్కా ప్లాన్స్ వేస్తున్నారట పూరి జగన్నాథ్, ఛార్మి. చాలా డిఫరెంట్ గా లైగర్ ప్రమోషన్స్ చేయాలని, ఈ పాన్ ఇండియా సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ తీసుకురావాలనే కోణంలో నయా ప్లాన్ సిద్ధం చేశారని ఇన్ సైడ్ టాక్.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనుండగా.. ఆయన సరసన బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.