Brahmastra 2: బ్రహ్మాస్త్ర విలన్‌గా విజయ్ దేవరకొండ.. రౌడీ స్టార్ డిఫరెంట్ లైన్!
Brahmastra 2: బ్రహ్మాస్త్ర విలన్‌గా విజయ్ దేవరకొండ.. రౌడీ స్టార్ డిఫరెంట్ లైన్!
Vijay deverakonda: లైగర్ డిజాస్టర్ తో కాస్త డీలా విజయ్ దేవరకొండ.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ కొట్టేశారని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర విలన్‌గా విజయ్ దేవరకొండను ఫైనల్ చేశారనే టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. లైగర్ డిజాస్టర్ తో కాస్త డీలా విజయ్ దేవరకొండ.. ఇప్పుడు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ కొట్టేశారని తెలుస్తోంది.
2/ 9
బ్రహ్మాస్త్ర యూనిట్ నుంచి విజయ్ దేవరకొండకు ఆఫర్ వచ్చినట్లు తాజా సమాచారం. బ్రహ్మాస్త్ర 2లో భాగం కావాల్సిందిగా విజయ్ కి ఆఫర్ ఇచ్చారట మేకర్స్. అందుకు విజయ్ దేవరకొండ కూడా ఇంట్రెస్ట్ చూపారని టాక్.
3/ 9
సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర సినిమాను మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మొదటి భాగం అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. బ్రహ్మస్త్ర ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
4/ 9
అయాన్ ముఖర్జీ (Ayan Mukharji) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ బ్రహ్మాస్త్ర సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ ఆలియా జంటగా నటిస్తున్నారు. అయితే బ్రహ్మాస్త్ర రెండో భాగంలో రణబీర్ కపూర్ గతాన్ని చూపించబోతున్నారట.
5/ 9
అలాగే ఈ రెండో భాగంలోనే సినిమాలోని మెయిన్ విలన్ దేవ్ పాత్రను చూపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం మంచి క్రేజ్ ఉన్న యాక్టర్ ని తీసుకోవాలని భావించిన బ్రహ్మాస్త్ర టీం.. విజయ్ దేవరకొండకు ఓటేసిందని తెలుస్తోంది.
6/ 9
బ్రహ్మాస్త్ర మొదటి భాగం ముగింపులో, దేవ్ ప్రత్యర్థిగా పరిచయం చేయబడతాడు. అప్పటి నుంచి ఈ క్యారెక్టర్లో ఎవరు చేస్తారు అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రణ్వీర్ సింగ్-హృతిక్ రోషన్ నటిస్తారని అభిమానులు చర్చించుకుంటున్నారు.
7/ 9
ఈ క్రమంలో ఈ క్యారెక్టర్ కోసం యష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత బాహుబలి స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరు తెర పైకి వచ్చింది. అయాన్ ప్రభాస్ ని సంప్రదించాడని కూడా అన్నారు.
8/ 9
ఇంతలో ఇప్పుడు టాలీవుడ్ రౌడీ స్టార్ అయిన విజయ్ దేవరకొండ పేరు బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే బ్రహ్మాస్త్ర మెయిన్ విలన్ గా విజయ్ దేవరకొండను చూడొచ్చు. అంతేకాదు రణ్‌బీర్ తండ్రిగా విజయ్ యాక్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేసేయొచ్చు.
9/ 9
భారతీయ పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకొని దుష్టశక్తిపై శక్తిమంతమైన యువకుడి చేసిన పోరాటమే బ్రహ్మస్త్ర. బాలీవుడ్లో అత్యంత భారీ ప్రాజెక్టుగా బ్రహ్మస్త్ర ప్రాజెక్ట్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్‌కి మంచి రెస్పాన్స్ రావడం మేకర్స్‌కి మరింత బలాన్నిచ్చింది.