సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరి ట్రెండ్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది తారలు కొన్ని సినిమాలతోనే తారాజువ్వలా దూసుకుపోతుంటారు. చేసింది కొన్ని సినిమాలే అయినా ఓ స్పెషల్ ఐడెంటిటీతో భారీ క్రేజ్ కొట్టేస్తుంటారు. అలాంటి వాళ్ళ లిస్టులో విజయ్ దేవరకొండ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
పెళ్లి చూపులు సినిమాతో పరిచయమై అర్జున్ రెడ్డి సినిమాతో యువత మనసు దోచేశారు విజయ్ దేవరకొండ. గీతగోవిందం సినిమాతో లేడీ ఆడియన్స్ని బుట్టలో వేసుకొని టాక్సీవాలా సినిమాతో దూసుకుపోయారు ఈ రౌడీ స్టార్. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా విజయ్ దేవరకొండ మాత్రం అందరి మదిలో అలా నిలిచిపోయారు.
చిత్రంలో విజయ్- అనన్య స్క్రీన్ ప్రెజెన్స్ యువతకు పిచ్చెక్కించనుందట. ఇప్పటిదాకా టాలీవుడ్ రౌడీ స్టార్ గా పిలిపించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. ఈ మూవీని ఎంతో గ్రాండ్గా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ రెట్టింపవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.