Vijay Devarakonda - AVD Multiplex : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.. తన స్వస్థలం మహబూబ్ నగర్లో ఓ మల్టీఫ్లెక్స్ను నిర్మించారు. అగ్రశ్రేణి సినిమా పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ రోజు ఈ మల్టీప్లక్స్ను విజయ్ దేవరకొండ నాన్న గారైన గోవర్ధన్ దేవరకొండతో పాటు ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు భరత్ నారంగ్, ఏషియన్ సునీల్, దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. (Twitter/Photo)
విజయ్ దేవరకొండ ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ బాటలోనే మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసారు విజయ్. మల్టీప్లెక్స్‌కు ఎవిడి సినిమాస్ అని పేరు పెట్టారు. ఈ రోజు ఈ మల్లీప్లెక్స్‌ను అధికారికంగా ప్రారంభించారు. (Twitter/Photo)
ఇది విజయ్.. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఏషియన్ సినిమాస్ మధ్య జాయింట్ వెంచర్‌గా వస్తోంది. ఈ థియేటర్., AVD సినిమాస్ (Asian Vijay Deverakonda’s AVD Cinemas) సెప్టెంబర్ 24 న నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ స్క్రీనింగ్‌తో ప్రారంభం చేస్తున్నారు. విజయ్ దేరకొండ థియేటర్స్‌లో నాగచైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా మొదటగా ప్రసారం కానుంది. (Twitter/Photo)
విజయ్, నారంగ్‌లు ఇటీవల AVD సినిమాస్‌లో ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ AVD అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ. ఇక గతంలో ఏషియన్ సినిమాస్ తోనే కలసి మహేష్ బాబు ఆరంభించిన AMB సినిమాస్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఏషియన్ సినిమాస్‌తో ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. (Twitter/Photo)
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. లైగర్‌లో విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌ను నందమూరి బాలకృష్ణ సడెన్ విజిత్ చేసి చిత్ర యూనిట్‌ను ఆశ్యర్యపరిచారు. (Twitter/Photo)