విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్‌తో పాటు దర్శకుడు శివ నిర్వాణ, గబ్బర్ సింగ దర్శకుడు హరీష్ శంకర్ హాజరైయ్యారు. ప్రేమకథ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి ఖుషీ అనే టైటిల్‌ని అనుకున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాదు ఏప్రిల్ 23 నుంచి కాశ్మీర్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరపనున్నారు టీమ్. ఇక ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహబ్ అనే మలయాళీ సంగీత దర్శకత్వం వహించనున్నారు. Photo : Twitter
ఇక విజయ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి .
ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది.
అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ.
ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ.
లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని అన్ని ప్రధాన భాషాల్లో విడుదలకానుంది లైగర్. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.