అది అలా ఉంటే ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించింది ఖుషి టీమ్. మొదట ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సమంత ఆరోగ్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇక లేటెస్ట్గా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించింది టీమ్. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకానుంది. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది ఖుషి టీమ్. Photo : Twitter
ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది.Photo : Twitter
ఖుషి సినిమా ఇలా ఉండగానే విజయ్ తన పన్నెండో సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలో షూట్‌కు వెళ్ల నుంది టీమ్. ఇక చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. Photo : Twitter
విజయ్ దేవరకొండకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో వస్తున్న వృషభలో విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కొడుకుగా విజయ్ కనిపించనున్నారట. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు నంద కిషోర్ విజయ్‌తో చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులో కూడా రూపోందనుందని సమాచారం. Photo : Twitter
విజయ్ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో సినిమా చేయనున్నారు. సర్కారు వారి పాట తర్వాత పరశురామ్, విజయ్‌కు ఓ కథ చెప్పాడట. అది నచ్చడంతో ఈ సినిమా ఓకే అయ్యింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. పరుశురామ్ బాలయ్యతో ఓ సినిమాను చేయాల్సి ఉంది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏది మొదట ముందుకు వెళ్లనుందో.. Photo : Twitter
ఇక లైగర్ విషయానికి వస్తే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger). అనన్యపాండే హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. Photo : Twitter
దేశవ్యాప్తంగా విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.. ఇక అది అలా ఉంటే మరోవైపు కర్ణుడి చావుకు వెయ్యి కారణాల చందంగా.. ఈ సినిమా మరో చెత్త రికార్డ్‌ను మూట గట్టుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ IMDb(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్‌లో లైగర్ సినిమాకు అతి తక్కువ రేటింగ్ వచ్చింది. Photo : Twitter
లైగర్ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ 11 కోట్ల మార్క్‌ని అందుకుంటుంది అనుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం మీద 9.57 కోట్ల రేంజ్లో షేర్ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 13.45 కోట్ల షేర్ అందుకుంది... Photo : Twitter
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేతులేత్తేసిన లైగర్ హిందీ బెల్ట్‌లో మాత్రం అదరగొట్టింది. ఈ సినిమా ప్రీమియర్స్‌తో కలిపి హిందీలో ఫస్ట్ డే సుమారు 6 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. పుష్ప, రాధేశ్యామ్, బాహుబలి1 సినిమాలకు కూడా ఫస్ట్ డే ఈ రేంజ్లో రాలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. సినిమా టాక్ బాగుట్టే అదరగొట్టేదని అంటున్నారు. Photo : Twitter
ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వచ్చింది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. . Photo : Twitter