రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger). అనన్యపాండే హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. Photo : Twitter
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ మొదటి రోజు బ్యాడ్ టాక్‌తో ఓ మోస్తరు కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ 11 కోట్ల మార్క్‌ని అందుకుంటుంది అనుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం మీద రూ. 9.57 కోట్ల రేంజ్లో షేర్ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 13.45 కోట్ల షేర్ అందుకుందని అందుకుంది. Photo : Twitter
ఈ సినిమా థియేట్రికల్‌గా దారుణంగా పరాజయం పాలైంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఏరియాల వారిగా కలెక్షన్స్ చూస్తే.. తెలంగాణ (నైజాం:) 5.75 కోట్లు, సీడెడ్ (రాయలసీమ): 1.85కోట్లు, ఉత్తరాంధ్ర: 1.77కోట్లు, తూర్పు గోదావరి: రూ. 88లక్షలు, వెస్ట్ గోదావరి :రూ. 55లక్షలు, గుంటూరు: రూ. 1 కోటి కృష్ణా: రూ. 69 లక్షలు, నెల్లూరు: రూ. 54లక్షలు, తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ మొత్తం:-రూ. 13.03 కోట్లు (22.35కోట్లు~ గ్రాస్), కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా-రూ. 1.60 కోట్లు ఇతర భాషలు - రూ. 85లక్షలు, ఉత్తర భారతదేశం - రూ. 9.30 కోట్లు, ఓవర్సీస్- 3.42 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ గా– 28.20 కోట్లు (60.80 కోట్ల గ్రాస్) వచ్చింది. Photo : Twitter
ఇక లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోరూ. 88.40 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది.మొత్తంగా రూ. 28.20 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా రూ. 61.80 కోట్ల థియేట్రికల్‌గా నష్టపోయింది. మొత్తంగా ఈ సినిమా కొన్నవాళ్లు మూడు రెట్ల నష్టపోయారు.మొత్తంగా ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘లైగర్’ మూవీ నిలిచింది. (Liger on hotstar Photo : Twitter)
ఇక మరోవైపు ట్రైలర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో.. టాక్ బాగుంటే లైగర్ బాక్సాపీస్ వద్ద రికార్డులు బద్దలు చేయడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ రైట్స్‌ను సరిగమ సినిమాస్ దక్కించుకుంది. దాదాపుగా 8 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్, కెజీయఫ్ సినిమాలు కూడా సరిగమ సినిమాస్ ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. .’ Photo : Twitter
ఇక లైగర్ ట్రైలర్‌తో (Liger Trailer) ఆకట్టుకుంది. ఊరమాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది ట్రైలర్లో.. క్రాస్ బ్రీడ్ సార్ వాడు.. అంటూ సాగే డైలాగ్‌తో మొదలైన.. మంచి విజువల్స్‌తో అదరగొట్టింది. దీనికి తోడు ఈ సినిమాలో విజయ్ నత్తితో సమమతమయ్యే క్యారెక్టర్ చేసారు. చివరగా మైక్ టైసన్ డైలాగ్ కూడా బాగుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీలో స్టార్ కిడ్ అనన్యపాండే హీరోయిన్గా (Ananya Panday) నటించింది. ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించారు. . Photo : Twitter
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను అన్ని భాషలకు దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుంది. మొత్తంగా థియేట్రికల్‌గా భారీగా నష్టపోయిన ఈ చిత్రం ఓటీటీ, శాటిలైట్ హక్కుల రూపంలో భారీగా లాభాలను ఆర్జించింది. లైగర్ (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథ. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.. Photo : Twitter
ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వచ్చింది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ లైగర్ ఫలితంతో జనగణమన సినిమా ఆగిపోయింది. (Photo : Twitter)
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. కానీ లైగర్ ఫలితం తేడా కొట్టడంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ మూలన పడింది. మరి పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడనేది చూడాలి. Photo : Twitter