Liger - Vijay Devarakonda : డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లైగర్ మూవీ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి BTS స్టిల్స్‌ను విడుదల చేశారు. ఇందులో పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండకు స్క్రిప్ట్ వివరిస్తోన్న స్లిల్ను విడుదల చేశారు. (Twitter/Photo)
ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా BTS స్టిల్స్ నుంచి విజయ్ దేవరకొండ కెమెరా నుంచి చూస్తోన్న స్టిల్‌ను కూడా విడుదల చేశారు. (Twitter/Photo)
సునీల్ శెట్టి (Sunil Shetty) ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను కాసేటి క్రితమే విడుదల చేసారు. లైగర్’ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 31న ఉదయం 10.03 నిమిషాలకు ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. (Instagram/Photo)
ఈ సినిమాను 2017లో అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ రోజున ఆగష్టు 25న రిలీజ్ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. (Twitter/Photo)
హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. అందులో ‘పుష్ప’ మొదటి భాగం ది రైజింగ్ డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లనే రాబడుతోంది.(Twitter/Photo)