రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీపుల్’ చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఋషి పాత్ర విజయ్ దేవరకొండకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక సోలో హీరోగా విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లి చూపులు’ సినిమా చేసారు. ఈ మూవీ విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే కదా. ఈ మూవీ విడుదలై నేటితో 5 యేళ్లు పూర్తి చేసుకుంది. (Twitter/Photo)
దాదాపు రూ. 1.5 కోట్ల బిజనెస్ చేసిన ఈ సినిమా టోటల్ థియేట్రికల్ రన్ ముగిసేసరికి నైజాం (తెలంగాణ) రూ. 5.30 కోట్లు + సీడెడ్ (రాయలసీమ) రూ. 70 లక్షలు + 3.30 కోట్లు + రెస్టాప్ ఇండియా రూ. 2 కోట్లు + ఓవర్సస్ రూ. 4.5 కోట్లు = మొత్తంగా రూ. 16 కోట్ల వరకు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా బయ్యర్స్‌కు రూ. 14.50 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. హీరోగా విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా హీరో కావడం వెనక ఈ సినిమానే కీ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. (Twitter/Photo)