Liger: ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్కి పిచ్చెక్కించిన విజయ్ దేవరకొండ!
Liger: ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్కి పిచ్చెక్కించిన విజయ్ దేవరకొండ!
Liger Trailer release date: విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.
2/ 8
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ- పూరి కాంబో కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
3/ 8
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీని ఎంతో గ్రాండ్గా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేస్తూనే హైప్ తీసుకురావడంలో వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు పూరి జగన్నాథ్.
4/ 8
ఇందులో భాగంగా రీసెంట్గా విడుదల చేసిన విజయ్ దేవరకొండ సెమీ న్యూడ్ పోస్టర్ వైరల్గా మారడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. పలువురు హీరోయిన్స్ కూడా ఈ పోస్టర్ చూసి తమ తమ ఫీలింగ్స్ బయటపెట్టారు.
5/ 8
ఆ తర్వాత వదిలిన అకిడి పకిడి మాస్ సాంగ్ వీడియో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ డాన్స్ మూమెంట్స్ చూసి పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. ఈ క్రమంలోనే అలాంటి మరో బిగ్గెస్ట్ అప్డేట్ ఇస్తూ తనదైన కోణంలో ట్వీట్ పెట్టారు విజయ్ దేవరకొండ.
6/ 8
లైగర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే అంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఈ ట్రైలర్ ని జూలై 21న విడుదల చేయబోతున్నామని పేర్కొన్న ఆయన.. ఆ రోజు ఇండియా మొత్తం మాస్, యాక్షన్, ఎంటర్టైన్ మెంట్ ఉంటుందని చెబుతూ తన సందేశం పోస్ట్ చేశారు.
7/ 8
తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ లైగర్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. లైగర్ ట్రైలర్ కోసం వెయింటింగ్ ఇక్కడ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
8/ 8
లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం. భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.