ప్యాన్ ఇండియా రేంజ్లో మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుని డిజాస్టర్ అయ్యింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger).
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబడుతున్నది. హీరోగా విజయ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్ పుల్లింగ్ స్టామినా కలిసి లైగర్ ను బాక్సాఫీస్ వద్ద తలెత్తుకునేలా చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. Liger Photo twitter
లైగర్ సినిమాకు ఐఎండిబిలో 10 పాయింట్స్‌కు కేవలం 1.7 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన డిజాస్టర్‌గా మారిన తమిళ సినిమా ది లెజెండ్ (4.7), అమీర్ ఖాన్ హిందీ లాల్ సింగ్ చడ్డా(5), తెలుగు సినిమా సన్ ఆఫ్ ఇండియాకు (5) కంటే తక్కువ రేటింగ్ నమోదు చేయడమేంటనీ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. Photo : Twitter