Vijay Devarakonda - Liger - Top10 Highest Screens Count : విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా మైక్ టైసన్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘లైగర్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో మరోసారి ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలపై మరోసారి ఫోకస్ ఏర్పడింది.
2) Bahubali 2 | ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి 2’. ఈ సినిమా అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డులకు ఎక్కడమే కాక.. బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8500 నుంచి 9000 వేల స్క్రీన్స్‌లో విడుదల అయింది. (Twitter/Photo)
4) రాధే శ్యామ్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన సినిమా రాధే శ్యామ్. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. కరోనా కారణంగా ఏడాదిగా ఈ సినిమా వాయిదా పడుతుంది. ఇప్పుడు మార్చ్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ’రాధే శ్యామ్’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అనిపించకోవాలంటే.. రూ. 204 కోట్లు వసూళు చేయాలి. ప్రభాస్ నటించిన గత సినిమాలు బాహుబలి, సాహో మూవీలతో పోలిస్తే చాలా వెనకబడిందనే చెప్పాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7010 స్క్రీన్స్‌లో విడుదలైంది. (Twitter/Photo)
6)బాహుబలి 1 | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి ఫస్ట్ పార్ట్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో తొలిసారి వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4000 పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. (Twitter/Photo)
7. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ కెరీర్లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో 300, సీడెడ్ (రాయలసీమ)లో 190పైగా స్క్రీన్స్‌లో, మిగిలిన ఆంధ్రప్రదేశం్లో 420, ఏపీ + తెలంగాణ కలిపి రూ. 930 పైగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక కర్ణాటకలో 100+, తమిళనాడులో 100+, కేరళలో 100+ థియేటర్స్, హిందీ+ రెస్టాఫ్ భారత్ కలిపి 1000 పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఓవర్సీస్లో 700 పైగా స్క్రీన్స్, టోటల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 3000 పైగా స్క్రీన్స్‌లో విడుదల అవుతోంది. ఒక రకంగా పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యధిక థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. (Instagram/Photo)
8)పుష్ప | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ మూవీ ఓవరాల్‌గా అన్ని భాషల్లో కలిపి రూ. 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏపీలో బ్రేక్ ఈవెన్ కానీ ఈ సినిమా మిగతా అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా 3000 స్క్రీన్స్‌లో విడుదలైంది. (Twitter/Photo)
10) సర్ధార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్, బాబీ కే.యస్.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 87.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2600 స్క్రీన్స్‌లో విడుదలైంది.
11) స్పైడర్ | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా .. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ. 124.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో అంతగా వర్కౌట్ కానీ ఈ సినిమా తమిళంలో మాత్రం మంచి బ్రేక్ ఈవెన్ అయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2400 స్క్రీన్స్‌లో విడుదలైంది. (Twitter/Photo)
12) భరత్ అను నేను | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భరత్ అను నేను’. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2400 స్క్రీన్స్‌లో విడుదలైంది. (Twitter/Phjoto)
14) వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కరోనా సమయంలో వచ్చిన ఈ చిత్రం అప్పటికి వసూళ్ల వర్షం కురిపించింది. 85 కోట్ల షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది. ఈ సినిమా 2174 స్క్రీన్స్‌లో విడుదల కానుంది. (Twitter/Photo)
15) సర్కారు వారి పాట | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2150 పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే థియేటర్స్‌లో RRR, KGF 2 సినిమాలు బాగా ఫర్ఫామ్ చేస్తుండంతో ఈ సినిమా తక్కువ థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. (Twitter/Photo)
18) మహర్షి | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘మహర్షి’. 2019 మే 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సూపర్ స్టార్ 25 సినిమాగా వచ్చిన మహర్షి మూవీ రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కరెక్ట్‌గా రూ. 100 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1900 స్క్రీన్స్‌లలో విడుదలైంది. (Twitter/Photo)
19) ‘భీమ్లా నాయక్’ | పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమా రూ. 106.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు కలెక్షన్లు రాబడుతోందో చూడాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1875 స్క్రీన్స్‌లో విడుదల కానుంది. (Twitter/Photo)
23) సరిలేరు నీకెవ్వరు | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలైంది. రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. wఈ సినిమా 1640 స్క్రీన్స్‌లో విడుదలైంది. (Twitter/Photo)