రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్. అనన్యాపాండే హీరోయిన్గా చేస్తున్నారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక అది అలా ఉంటే.. Photo : Twitter
ఈ సినిమా తాజగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా నిడివి కూడా కాస్తా తక్కువుగానే ఉంది. ఈ సినిమా రెండు గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి లైగర్ టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
ఇక ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతోందట. కేవలం ఒక్క నైజాం ఏరియాకే థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తెలుగులో టాప్ స్టార్స్ సినిమాలకు మామూలుగా ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందని.. దీంతో ఈ రేంజ్లో విజయ్ సినిమాకు బిజినెస్ అంటే విశేషమే అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మిగితా ఏరియాల గురించి తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో.. టాక్ బాగుంటే లైగర్ బాక్సాపీస్ వద్ద రికార్డులు బద్దలు చేయడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు. Photo : Twitter
ఇక లైగర్ ట్రైలర్ (Liger Trailer) విషయానికి వస్తే.. ఊరమాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది ట్రైలర్లో.. క్రాస్ బ్రీడ్ సార్ వాడు.. అంటూ సాగే డైలాగ్‌తో మొదలైన.. మంచి విజువల్స్‌తో అదరగొట్టింది. దీనికి తోడు ఈ సినిమాలో విజయ్ నత్తితో సమమతమయ్యే క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. చివరగా మైక్ టైసన్ డైలాగ్ కూడా బాగుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీలో స్టార్ కిడ్ అనన్యపాండే హీరోయిన్గా (Ananya Panday) చేస్తున్నారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. Photo : Twitter
అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథ. Photo : Twitter
మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. Photo : Twitter
ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. Photo : Twitter
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. ఇక విజయ్, సమంతలు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. Liger team Twitter