విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య స్నేహం తెలియంది కాదు. ఈ ఇద్దరూ దాదాపుగా ఒకేసారి తెలుగు సినిమాల్లో కెరీర్‌ను స్టార్ట్ చేశారు. గీతగోవిందం సూపర్ హిట్ తర్వాత డియర్ కామ్రెడ్ సినిమాల్లో కలిసినటించారు. ఆ మధ్య ఇద్దరూ కలిసి వెకేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్గా విజయ్, రష్మికలు దుబాయ్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి కొన్నిపిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు విజయ్ తాజాగా అక్కడి నుంచి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. Photo : Twitter
దీంతో ఈ ఇద్దరూ మరోసారి విదేశాల్లో షికారు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, పెళ్లి చేసుకుంటే భలే క్యూట్‌గా ఈ జంట ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే విజయ్, రష్మికలు ఇప్పటికే తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ప్రస్తుతం వీరి పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. రష్మిక ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తుంది. ఆమె నటించిన హిందీ సినిమా మిషన్ మజ్ను తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి ఆదరణపొందుతోంది. Photo : Twitter
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. లైగర్ తర్వాత విజయ్ ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇలా ఉండగానే విజయ్ తన పన్నెండో సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలో షూట్‌కు వెళ్ల నుంది టీమ్. ఇక ఈ సినిమాను మొదట ఎన్వీ ప్రసాద్‌తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నట్లు టాక్ నడిచింది.. Photo : Twitter
ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మలయాళీ సినిమా హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. Photo : Twitter
అది అలా ఉంటే విజయ్ దేవరకొండకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో వస్తున్న వృషభలో విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కొడుకుగా విజయ్ కనిపించనున్నారట. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు నంద కిషోర్ విజయ్‌తో చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులో కూడా రూపోందనుందని సమాచారం. Photo : Twitter
అంతేకాదు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మరో గాసిప్ ప్రకారం విజయ్, మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట తర్వాత పరశురామ్, విజయ్‌కు ఓ కథ చెప్పాడట. అది నచ్చడంతో ఈ సినిమా ఓకే అయ్యిందని టాక్. ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. పరుశురామ్ బాలయ్యతో ఓ సినిమాను చేయాల్సి ఉంది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏది మొదట ముందుకు వెళ్లనుందో.. Photo : Twitter
ఇక లైగర్ విషయానికి వస్తే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger). అనన్యపాండే హీరోయిన్గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. Photo : Twitter
లైగర్ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ 11 కోట్ల మార్క్‌ని అందుకుంటుంది అనుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం మీద 9.57 కోట్ల రేంజ్లో షేర్ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 13.45 కోట్ల షేర్ అందుకుంది... Photo : Twitter
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేతులేత్తేసిన లైగర్ హిందీ బెల్ట్‌లో మాత్రం అదరగొట్టింది. ఈ సినిమా ప్రీమియర్స్‌తో కలిపి హిందీలో ఫస్ట్ డే సుమారు 6 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. పుష్ప, రాధేశ్యామ్, బాహుబలి1 సినిమాలకు కూడా ఫస్ట్ డే ఈ రేంజ్లో రాలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. సినిమా టాక్ బాగుట్టే అదరగొట్టేదని ట్రేడ్ వర్గాల మాట. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్ హాట్ స్టార్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథ. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.. Photo : Twitter
ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వచ్చింది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. . Photo : Twitter