Vijay-Pooja Hegde | Beast Telugu : తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Photo : Twitter
అది అలా ఉంటే బీస్ట్ ఏప్రిల్ 13న విడుదలవ్వుతుండడంతో ఆయన ఫ్యాన్స్ కోసం కొన్ని కంపెనీలు సెలవుల్నీ ప్రకటించడంతో పాటు టికెట్స్ కూడా ఇస్తున్నాయట. చెన్నైలోని పలు కార్పోరేట్స్ కంపెనీల హెచ్ ఆర్‌లకు లీవ్ కావాలంటూ చాలా అప్లీకేషన్స్ రావడంతో చేసేదేం లేక బీస్ట్ విడుదల రోజు కంపెనీకి సెలవు ప్రకటించాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని లెటర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలా మంది అభిమానులు సినిమా చూడటానికి తమ ఆఫీసుల వద్ద 'సెలవు' కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించారట. అభిమానుల ఒత్తిడి కారణంగా కార్పొరేట్ కార్యాలయాలు సెలవు ప్రకటించాయి. తమిళనాడులోని పలు కంపెనీలు ఏప్రిల్ 13ని సెలవు దినంగా ప్రకటించాయి. ఇంకొన్ని కంపెనీలు ఏకంగా సెలవుతోపాటు టికెట్స్ కూడా ఇస్తున్నాయట. సెలవులు ప్రకటిస్తూ కార్పొరేట్ కార్యాలయాలు రాసిన పలు లేఖలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
ఇక యాక్షన్-థ్రిల్లర్‌గా వస్తోన్న బీస్ట్ విషయానికి వస్తే.. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ భారీగా నిర్మించింది. పూజాహెగ్డే హీరోయిన్గా చేశారు. ఇక అది అలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బీస్ట్ అనుకున్నంతగా లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దర్శకుడు అభిమానులకు డిస్సాప్పాంట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. చెన్నైలో కొందరు అభిమానులు ఏకంగా సినిమా బాగాలేదని థియేటర్‌ను తగలబెట్టే ప్రయత్నం చేశారు. Photo : Twitter
ఈ సినిమాకు సంబంధించి తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ (Beast Trailer) చూస్తుంటే.. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో వావ్ అనిపించింది. విజయ్ ఇండియన్ స్పై వీర రాఘవన్ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు. బీస్ట్ ట్రైలర్లో (Beast Trailer) అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం మరో రేంజ్లో ఉంది. చూడాలి మరి థియేటర్స్‌లో ఎలా ఆకట్టుకుంటుందో.. Photo : Twitter
ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్ రాజు (Dil Raju) దక్కించుకున్నారు. బీస్ట్ తెలుగు (Beast Telugu Trailer) ట్రైలర్‌ను ఏప్రిల్ 5న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేశారు. ఇక మరోవైపు ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్స్ మాత్రం.. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ మాత్రం ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్‌ను పోలి ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ విషయంలో చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. Photo : Twitter
దీంతో ఆయన తాజాగా సినిమా బీస్ట్‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే తెలుగులో బీస్ట్‌కు విజయ్ కెరీర్ లోనే రికార్డు ఫిగర్ కి థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ 11 కోట్లకు అమ్ముడు అయ్యినట్లు టాక్ నడుస్తోంది. ఇక బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. బాక్సాఫీస్ దగ్గర కెజియఫ్‌తో పోటీ పడాల్సి వస్తుంది. Photo : Twitter
కన్నడ సంచలన చిత్రం KGF: చాప్టర్ 2 ఏప్రిల్ 14న వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఒక రోజు గ్యాపులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. బీస్ట్ తమిళనాడులో KGF: చాప్టర్ 2ని డామినేట్ చేస్తుంది. కానీ సినిమా మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం KGF డామినేట్ చేయోచ్చని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన బీస్ట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. Photo : Twitter
బీస్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఇటీవలే అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని చెన్నై, జార్జియాల్లో భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అరబిక్ కుతు అనే సాంగ్ సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తోంది. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందించారు. Photo : Twitter
ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ‘జాలీ ఓ జింఖానా’ (Jolly O Gymkhana) అనే టైటిల్‌తో విడుదలైన ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కూ కార్తిక్ రాసిన ఈ పాటను ఈ సినిమా హీరో (Thalapathy Vijay) విజయ్ స్వయంగా పాడారు. ఇక ఇప్పటికే బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్గా చేస్తున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే... గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు నెల్సన్. ఈ సినిమా కంటే ముందు నయనతారతో చేసిన కోకో సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ హీరోగా సినిమా చేసే అవకాశం అందుకున్నారు. త్వరలోనే ఈయన రజనీకాంత్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. Photo : Twitter