తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. వరుణ్ 'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల విడుదలైన ఈ సినిమా పెద్దగా అలరించలేక పోయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టింది. (Beast Trailer Talk Photo ): Twitter
'సన్ పిక్చర్స్' బ్యానర్ పై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజ్ భారీ ధర పెట్టి కొన్నారు. అయితే సినిమా సరిగా ఆకట్టుకోకపోవడంతో నష్టాలు వచ్చాయి. ఈ సినిమాకు పోటీగా కేజీఎఫ్ 2 విడుదలై సంచలన విజయం సాధించింది. ఇక కేజీఎఫ్ 2 పోటీ తట్టుకొని ఈ సినిమా ఓవరాల్‌గా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. Photo : Twitter
బీస్ట్ నైజాం 2.45 కోట్లు, సీడెడ్‌లో 1.10 కోట్లు, ఉత్తరాంధ్ర 0.90 కోట్లు, ఈస్ట్ 0.63 కోట్లు, వెస్ట్ 0.62 కోట్లు, గుంటూరు 0.80 కోట్లు, కృష్ణా 0.52 కోట్లు, నెల్లూరు 0.40 కోట్లు వసూలు అయ్యాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణలో చూస్తే.. బీస్ట్‌కు 7.42 కోట్లు వసూలు అయ్యాయి. అయితే 'బీస్ట్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.11 కోట్ల షేర్‌ను రాబట్టాల్సింది. కాగా ఫుల్ రన్ ముగిసేసరికి ఈ బీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో రూ.7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బీస్ట్ ఇక్కడి నిర్మాతలకు దాదాపుగా రూ.3.26 కోట్ల నష్టాలను మిగిల్చింది. Photo : Twitter
మొత్తంగా తమిళనాడు -66.10 కోట్లు ( రూ. 127.10 కోట్లు గ్రాస్ ) తెలుగు రాష్ట్రాలు - రూ. 7.33 కోట్లు ( రూ. 13.20 కోట్ల గ్రాస్) కర్ణాటక – 6.40 కోట్లు ( రూ. 13.30 కోట్ల గ్రాస్) కేరళ – 5.00 కోట్లు ( రూ. 10.65 కోట్ల గ్రాస్) రెస్టాఫ్ భారత్ – 1.73 కోట్లు (రూ. 3.50 కోట్ల గ్రాస్ ) ఓవర్సీస్ – రూ. 33.05 కోట్లు (రూ. 67.30 కోట్ల గ్రాస్) టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ 119.61 కోట్లు (రూ. 235.05 కోట్ల గ్రాస్ ) కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా 125.50 కోట్లకు అమ్మారు. రూ. 127 కోట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగి.. కేజీఎఫ్ 2 దాటికి తట్టుకొని ఈ సినిమా రూ. 7.39 కోట్ల లాస్‌తో ఈ సినిమా అబౌ యావరేజ్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఇక యాక్షన్-థ్రిల్లర్‌గా వచ్చిన బీస్ట్ విషయానికి వస్తే.. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ భారీగా నిర్మించింది. పూజాహెగ్డే హీరోయిన్గా చేశారు. ఇక అది అలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బీస్ట్ అనుకున్నంతగా లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దర్శకుడు అభిమానులకు డిస్సాప్పాంట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. చెన్నైలో కొందరు అభిమానులు ఏకంగా సినిమా బాగాలేదని థియేటర్ పరదాను తగలబెట్టారు. Photo : Twitter