తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీతో పలకరించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. (Twitter/Photo)
తమిళ స్టార్ హీరో విజయ్ విషయానికొస్తే.. ఈయన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ ప్రముఖ యాక్షన్ దర్శకుడు. ఆయన డైరెక్ట్ చేసిన పలు చిత్రాల్లో విజయ్ బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాలయై తీర్పు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసారు. తొలి సినిమాతోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరోగా పీక్స్‌లో ఉండగానే.. తాను ప్రేమించిన సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి పెళ్లి కూడా ఎంతో నాటకీయంగా జరిగింది. (Twitter/Photo)
తమిళనాట రజినీకాంత్ తర్వాత నెక్ట్స్ జనరేషన్లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ నిలిచారు. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇపుడు రాబోయే చిత్రానికి ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్‌కు ఎదిగారు. భారతీయ చిత్ర పరిశ్రమలో అక్షయ్ కుమార్, ప్రభాస్ తర్వాత రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న హీరోగా రికార్డులకు ఎక్కారు. (Twitter/Photo)