ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం అత్యాచారం కేసులో విజయ్ను అరెస్ట్ చేసినట్టు కోచ్చి డిప్యూటీ పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. సాక్ష్యాధారల సేకరణలో భాగంగా అతన్ని అత్యాచార సంఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ కేసులో భాగంగా నటుడు కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో అతనికి కోర్డు బెయిల్ మంజూరు చేసింది. (File/Photo)
ఈ సందర్భంగా బాధిత నటి మాట్లాడుతూ.. విజయ్ బాబు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి.. ఎర్నాకులంలోని తన ఇంటికి పిలిపించుకొని పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు చిత్ర హింసలకు గురిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంతేకాదు పలుసార్లు తనపై భౌతిక దాడులకు పాల్పడినట్టు ఈ సందర్భంగా పోలీసులకు తెలిపింది. (File/Photo)