Vijay 67 Movie : తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ సినిమా వారసుడు. తమిళంలో వారిసు పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తన 67వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కన్ఫామ్ చేయడంతో పాటు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా (పిబ్రవరి 1) లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ సినిమాలో విజయ్‌తో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు.కేజీఎఫ్ 2 తర్వాత మరోసారి విజయ్ 67వ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం సంజయ్ దత్‌కు భారీ పారితోషకం ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు విజయ్‌కు జోడిగా త్రిష చాలా యేళ్ల తర్వాత విజయ్‌కు జోడిగా కనిపించనుంది. (Twitter/Photo)
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) విజయ్ విషయానికొస్తే.. రీసెంట్గా ఈయన నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Varasudu) పేరుతో డబ్ అయ్యింది. దిల్ రాజు నిర్మాత, రష్మిక మందన్న హీరోయిన్.. మంచి అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 14న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబడుతోంది. ఎట్టకేలకు వారిసు సినిమా తమిళంలో పాటు తెలుగు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Vaarasudu)గా డబ్ అయ్యింది. విజయ్ కెరీర్లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. కన్నడ అందం రష్మిక మందన్న హీరోయిన్గా ( Rashmika Mandanna) చేసింది.
ఇక తమిళంలో జనవరి 11న విడుదలైన ఈ సినిమా.. తెలుగులో భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. సినిమా విజువల్‌గా గ్రాండియర్‌గా తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో ఏమోషన్స్, యాక్షన్ సమపాళ్లలో తెరకెక్కించాడు. కథ విషయానికి వస్తే.. శరత్‌కుమార్ విజయ్‌కు తండ్రిగా నటించారు. అతని అన్నలులుగా శ్రీకాంత్, కిక్ శ్యామ్ నటించారు. . ఒక పెద్ద కుటుంబం.. ముగ్గురు అన్నదమ్ములు స్టోరీ. Photo : Twitter
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. వారసుడు సినిమా మొదటి రోజు 3.10 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగులో రెండు రాష్ట్రాల్లో 15.01 కోట్ల షేర్ (రూ. 27.02కోట్ల గ్రాస్ ) వసూళ్లుతో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని తెలుగులో కూడా క్లీన్ హిట్‌గా నిలిచింది. వచ్చాయి. Photo : Twitter
నెగిటివ్ టాక్‌తో వారసుడు తెలుగులో హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం. ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం కూడా మంచి పరిణామనే చెప్పాలి. ఇకవారసుడు సినిమా బాగున్నప్పటికీ ... ఈ కంటెంట్ తెలుగులో ఇప్పటికే చాలా సార్లు రావడం ఒక కారణం అవ్వగా.. విజయ్‌కు తెలుగులో అంతగా పాపులారిటీ లేకపోవడం కూడా ఓ కారణం అని అంటున్నా ఎలాగో గట్టెక్కింది. Photo : Twitter
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 3 వారాల కలెక్షన్స్ విషయానికొస్తే.. తమిళనాడు - రూ. 133.45 కోట్లు గ్రాస్.. తెలుగు రాష్ట్రాలు.. రూ. 27.55 కోట్లు.. కర్నాటక .. రూ. 14.47 కోట్లు గ్రాస్.. కేరళలో రూ. 11.94 కోట్లు.. రెస్టాఫ్ భారత్ - రూ. 14.30 కోట్ల గ్రాస్.. ఓవర్సీస్ -- రూ. 85.30 కోట్ల గ్రాస్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 287 కోట్ల గ్రాస్.. (రూ. 146.42 కోట్ల షేర్ ) సాధించింది. ఈ సినిమా రూ. 137.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 139 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది.రూ. 7.42 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)