విఘ్నేశ్ తల్లి మీనా కుమారి మాట్లాడుతూ.. 'నా కొడుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్, నా కోడలు టాప్ హీరోయిన్. ఇద్దరూ కష్టపడి పని చేసేవారే! నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు ఉన్నారు. అయితే అందులో ఒకరికి నాలుగు లక్షల అప్పు ఉందని నయనతారకు తెలిసింది.వెంటనే వాళ్లకు ఆ డబ్బులిచ్చి సాయం చేసిందని తెలిపారు.
తన కోడలిది ఎంతో గొప్ప మనసు అని తెలిపారు. తన దగ్గర పనిచేసేవాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందంటూ పొగడ్తలు కురిపించారు. అంతేకాదు.. నయనతారకు. పది మంది చేసే పనిని కూడా ఒంటిచేత్తో చేయగల సత్తా ఉంది. కొడుకు కోడలిద్దరూ కష్టపడటమే కాదు వారిలా కష్టపడేవాళ్లను ఎంతగానో గౌరవిస్తారు అని చెప్పుకొచ్చింది మీనా కుమారి.
ఇటు నయన్ సినిమాల విషయానికి వస్తే.. ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారింది. ఇటీవలే తెలుగులో చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్లో నటించింది. ఈ సినిమాలో నయన్ చిరుకు చెల్లెలిగా నటించింది.మరోవైపు బాలీవుడ్ లో కూడా షారుక్ ఖాన్‌తో కలిసి నయన్ ఓ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.