నయనతార పెళ్లి ఎప్పుడు జరుగుతుందని అభిమానులంతా ఎదురుచూశారు. శింబుతో ప్రేమ ప్రయాణం బెడిసి కొట్టడం, ప్రభుదేవాతో పీటల మీద పెళ్లి ఆగిపోవడం వంటి విషయాల తరువాత నయన్ ఫ్యాన్స్ బాగానే హర్ట్ అయ్యారు. ప్రతీసారి ఇలా అవుతుంది ఏంటంటూ.. నయన్ అభిమానులు హర్ట్ అవుతూ వచ్చారు. అయితే విఘ్నేశ్ శివన్‌తో నయన్ ప్రేమ కథ మొదలైంది. గత ఐదారేళ్లుగా ఈ ప్రేమ ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మొత్తానికి జూస్ తొమ్మిదో తేదీన ఈ ఇద్దరూ వివాహాం చేసుకున్నారు.