సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం నటుడు శింబు, ఆ తర్వాత ప్రభు దేవాలతో నయనతార ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా వారితో ప్రేమ పెటాకులుకావడంతో కొంతకాలం ఒంటరిగా ఉన్న నయనతార ఆ తరువాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగిపోయింది.
వీరిద్దరూ చాలాకాలం నుంచి సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లి ఎప్పుడన్న విషయంపై మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నారని...త్వరలోనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని...ముహుర్తం తేదీ కూడా ఫిక్సైపోయిందంటూ రకరకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.