Venkatesh Bobbili Raja 31 Years | విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’ సినిమా విడుదలై నేటితో 31 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సాధించిన విశేషాలు..
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’ సినిమా విడుదలై నేటితో 31 యేళ్లు పూర్తి చేసుకుంది. (Twitter/Phhoto)
2/ 13
డి.రామానాయుడు సమర్ఫణలో డి.సురేష్ బాబు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై నిర్మించిన బొబ్బలి రాజా చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించారు. (Twitter/Photo)
3/ 13
1990 సెప్టెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌నే మార్చివేసింది. ఈ చిత్రంతో వెంకటేష్ టాప్ స్టార్‌గా టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (Twitter/Photo)
4/ 13
‘బొబ్బిలి రాజా’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం పెద్ద ఎస్పెట్గా నిలిచింది. (Twitter/Photo)
5/ 13
పూర్తి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్ కొట్టారు. (Twitter/Photo)
6/ 13
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ జాకీచాన్ తరహా యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. (Twitter/Photo)
7/ 13
‘బొబ్బలి రాజా’ ద్వి శత దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన నట భూషణ శోభన్ బాబు. ఈ చిత్రం 3 కేంద్రాల్లో ద్వి శత దినోత్సవం జరుపుకోవడం విశేషం. (Twitter/Photo)
8/ 13
‘బొబ్బలి రాజా’ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో వాణిశ్రీ, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శివాజీ రాజా నటించారు. (Twitter/Photo)
9/ 13
‘బొబ్బిలి రాజా’ సినిమా తమిళంలో ‘వాలిబన్’ పేరుతో డబ్ అయింది. అక్కడ కూడా సూపర్ హిట్టైయింది. హిందీలో ‘రామ్ పూర్ కా రాజా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. (Twitter/Photo)
10/ 13
1990లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత హైయ్యేస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. (Twitter/Photo)
11/ 13
బొబ్బలి రాజా సినిమాకు మొదటిసారి తెరపై నిర్మాతగా సురేష్ బాబు పేరు కనిపించింది. ప్రతిధ్వని తర్వాత బి.గోపాల్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కించిన చిత్రం. (Twitter/Photo)
12/ 13
‘బొబ్బిలి రాజా’ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ మాటలు అందించారు. వేటూరి పాటలు అందించారు. (Twitter/Photo)
13/ 13
అత్తా అల్లుళ్ల కథతో తెరకెక్కించడంతో తల్లి కోరికను తీర్చడం ఈ సినిమా ముఖ్యకథ. ఈ చిత్రానికి పరుచూరి వేంకటేశ్వరరావు కథను అందించారు. మాటలు గోపాల కృష్ణ రాసారు. (Twitter/Photo)