కొన్ని రోజులుగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే నిజమైంది. జులై 20న నారప్ప ప్రైమ్లోనే విడుదల కానుంది. థియేటర్స్ తెరిచే ఉన్నా ఇప్పుడు సినిమాలు విడుదల చేయట్లేదు నిర్మాతలు. కొన్ని రోజులు ఆగినా కూడా అప్పుడున్న పోటీకి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే నారప్ప సినిమాను ఓటిటిలో విడుదల చేయబోతున్నారు.