Vekantesh: తమ్ముడు వెంకటేష్ కోసం డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసిన అన్న సురేష్ బాబు..

Venkatesh - Suresh Babu - Driving Licence | మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న వెంకీ మామ.. ప్రస్తుతం తమిళంలో హిట్టైయిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. మరోవైపు మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 ను అదే టైటిల్‌తో రీమేక్ చేసారు. ఇపుడు తాజాగా మలయాళంలో హిట్టైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.