టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రమాదం జరిగిందనే విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ తరం ప్రేక్షకులకు ప్రభాస్ పెదనాన్నగానే కృష్ణంరాజు పరిచయం కానీ నాటి ప్రేక్షకులకు మాత్రం ఈయన రేంజ్ ఏంటో బాగా తెలుసు. ఒకప్పుడు తెలుగులో క్లాస్, మాస్ సినిమాలతో ఊపేసాడు కృష్ణంరాజు. రెబల్ స్టార్ బిరుదుతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసాడు. మాస్ సినిమాల్లో కృష్ణంరాజు శైలి ప్రత్యేకం.
ఈయన చేసిన సినిమాలు అప్పట్లో సంచలన విజయం సాధించాయి. వయోభారంతోనే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు ఈ సీనియర్ హీరో. మధ్యలో అప్పుడప్పుడూ తన కొడుకు ప్రభాస్ సినిమాలలోనే కనిపిస్తున్నారు. అప్పట్లో బిల్లా.. ఆ తర్వాత రెబల్.. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలలో నటించారు కృష్ణంరాజు. ఇదిలా ఉంటే తాజాగా షాకింగ్ నిజం ఒకటి బయటికి వచ్చింది. ఈ క్రమంలోనే అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఇప్పుడు కృష్ణంరాజుకు ఏమైందని ఆరా తీస్తున్నారు.
తాజాగా ఈయనకు ఓ సర్జరీ జరిగిందని తెలుస్తుంది. ఈ మధ్యే ఈయన ఓ చిన్న ప్రమాదానికి గురయ్యారు. 2021 సెప్టెంబర్లో కాలు జారి బాత్రూమ్లో కింద పడ్డారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం సమాచారం రాలేదు. కానీ ఆ సమయంలో ఆయన తుంటి భాగానికి ఫ్రాక్చర్ అయ్యింది. అపోలో వైద్యులు దీనికి శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని తెలుస్తుంది.
అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదం కారణంగానే ఆ మధ్య డిసెంబర్లో జరిగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా కుర్చీకే పరిమితం అయ్యారు కృష్ణంరాజు. మీ అందర్నీ చూస్తుంటే లేచి నిలబడి డాన్స్ చేయాలనిపిస్తుంది కానీ కొన్ని కారణాలతో ఆగిపోతున్నానని చెప్పారు ఆయన.