Venkatesh Wife Neeraja Reddy | విక్టరీ వెంకటేష్.. తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్‌తో..ఆయనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి అండతో తొలి అడుగులు వేసినా... ఆతర్వాత తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేశ్. అంతేకాదు హీరోగా 36 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
ఇప్పటికీ ఇంట్లో నలుగురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటుంది. అంతేకాదు వారి చదువులో ఆమె పాత్రనే కీలకం. ప్రతి ఇంట్లో ఇల్లాలి పాత్రనే కీలకం అనే చెప్పాలి. అలా పెద్దింటి కోడలైనా ఒక సామాన్యురాలిగానే కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోంది నీరజా రెడ్డి. ఇక వెంకటేష్ నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్‌కు ఈవెంట్స్‌కు ఆమె హాజరైన దాఖలాలు దాదాపు లేనే లేవనే చెప్పాలి.
వెంకటేష్ విషయానికొస్తే.. గతేదాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘F3’ మూవీ చేసారు. ఆ తర్వాత ‘ఓరి దేవుడా’లో ఇంపార్టెంట్ రోల్లో మెరిసారు. తాజాగా ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో తన అన్న సురేష్ బాబు అబ్బాయి రానాతో కలిసి ‘రానా నాయుడు’అనే వెబ్ సిరీస్ చేసారు. ఈ సిరీస్‌లో పెద్దలకు మాత్రమే అనే తరహాలో ఉండటంతో పాటు వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా నటించడం వంటివి వెంకీ ఇమేజ్ పై నీలి నీడలు కమ్ముకునేలా చేసాయి. ప్రస్తుతం శైలష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.