Ori Devuda| వెంకటేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫ్యాంటసీ లవ్ డ్రామా ‘ఓరి దేవుడా’. ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించారు. ఎఫ్ 3 తర్వాత ఈ సినిమాలో నటించారు. ఇక ముఖ్యపాత్రలో విశ్వక్సేన్ నటించారు. దీపావళీ సందర్భంగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమాకు టాక్ బాగున్నా.. అందుకు తగ్గ కలెక్షన్స్‌ను రాబట్లలేకపోయింది. ఇప్పటికే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికొస్తే..
ముఖ్యంగా వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా అదరగొట్టారు. ఇక ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం రూ. 2.06 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) రూ. 56 లక్షలు.. ఉత్తరాంధ్ర రూ. 78 లక్షలు.. ఈస్ట్ గోదావరి రూ. 29 లక్షలు.. వెస్ట్ గోదావరి రూ. 21 లక్షలు.. గుంటూరు రూ. 38 లక్షలు.. కృష్ణ రూ. 47 లక్షలు.. నెల్లూరు రూ. 12 లక్షలు.. ఏపీ + తెలంగాణ రూ. 4.87 కోట్లు ( 8.65 కోట్ల గ్రాస్ వసూళ్లు) కర్ణాటక + రెస్టాఫ్ భారత్ -రూ. 15 లక్షలు.. ఓవర్సీస్ రూ. 70 లక్షలు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.72 కోట్లు (రూ. 10.50 కోట్ల గ్రాస్) Photo : Twitter
ఈ మూవీ తెలుగులో రూ. 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా 28 లక్షల స్పల్ప నష్టాలతో గట్టెక్కింది. వెంకటేష్ విషయానికొస్తే.. ఈ ఇయర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇందులో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. మరోవైపు అబ్బాయి రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. Photo : Twitter
ఇక విశ్వక్ సేన్ తాజాగా ఓ కాంట్రవర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉండగా.. ఈ సినిమా షూటింగ్ రాకపోవడంతో.. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, మరోవైపు విశ్వక్ కూడా కొన్ని మార్పులు చెప్పానని.. అయితే అవి చేయలేదని.. తన వర్షన్ చెప్పడం ఇలా ఆ వివాదం ముగిసింది. Photo : Twitter
ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ ముఖచిత్రం (Mukhachitram) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ నటిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ (Mukhachitram) చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. Photo : Twitter