వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ఎఫ్3. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఎఫ్3 ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 3 థియేటర్లలో నవ్వుల సునామి సృష్టించింది. ప్రస్తుతం థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా దిశగా అడుగులు వేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికీ ఏపీ, తెలంగాణలో 10 థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. Photo : Twitter
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషక్షన్స్ విషయానికి వస్తే.. ఎఫ్ 3, నైజాంలో 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి అరుదైన ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా తన లైఫ్ టైమ్ రన్లో ఎపీ, తెలంగాణలో 53.94 Cr షేర్‌ను సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా 70.94 Cr షేర్ వసూలు చేసింది. ఎఫ్3 ప్రపంచవ్యాప్తంగా 134 కోట్లను వసూలు చేసింది. Photo : Twitter
సినిమా ఏరియాల వారీగా చూస్తే.. నైజాం- 20.57 కోట్లు, ఉత్తరాంధ్ర- 7.48 కోట్లు, తూర్పు- 4.18 కోట్లు, వెస్ట్ - 3.41 కోట్లు, కృష్ణ - 3.23 కోట్లు, గుంటూరు - 4.18 కోట్లు, నెల్లూరు- 2.31 కోట్లు, సీడెడ్- 8.58 కోట్లు, కర్ణాటక - 5 కోట్లు, రెస్టా ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ - 10 కోట్లు వసూలు అయినట్లు ఎఫ్ 3 టీమ్ అధికారికంగా ప్రకటించింది. Photo : Twitter
F3 మూవీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. F3 మూవీలో ప్రేక్షకులకు ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.. (Twitter/Photo)
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జీవితంలో బంధాలకు, అనుబంధాలకు విలువ లేదనీ, డబ్బే సర్వమని నమ్మిన కొంతమంది వ్యక్తులు దానిని ఈజీగా సంపాదించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు. (Twitter/Photo)