Venkatesh - Varun Tej - F3 | అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ఎఫ్ 3. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా అని చెప్పినా.. అదే నటీనటులతో కొత్త కాన్సెప్ట్‌తో ఎఫ్ 3 మూవీ తెరకెక్కించారు. రొటీన్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా ఎంత బాకీ ఉందంటే.. (Photo Twitter)
తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total -రూ. 42.65 కోట్లు (68.65 కోట్ల గ్రాస్) / రూ. 53.80 కోట్లు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 11 కోట్లకు పైగా రాబట్టాలి. ప్రస్తుతం మేజర్, విక్రమ్ మూవీలు హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. మొదటి మూడు, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 మూవీ టోటల్ రన్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 52.54 కోట్లు ( రూ. 88.06 కోట్ల గ్రాస్ ) /రూ. 63.60 కోట్లు.. ఓవరాల్‌గా 64.50 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 52.54 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రూ. 11.96 కోట్లు రాబట్టాలి. ఇపుడున్న పరిస్థితుల్లో ఈ రేంజ్ వసూళ్లు దక్కాలంటే మాములు విషయం కాదు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచే అవకాశాలున్నాయి. (Twitter/Photo)