ఈ సినిమా విడుదలై నిన్నటితో 10 రోజులు పూర్తి కాగా.. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి 41.81 కోట్ల షేర్, 67.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. మిగిలిన రాష్ట్రాలు కూడా కలిపి ప్రపంచవ్యాప్తంగా చూస్తే 51.61CR షేర్, 86.51CR గ్రాస్ వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే మరో 12.89Cr రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్లు.
కాగా ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలు నెల తిరిగే లోపు ఓటీటీలోకి (OTT) వస్తుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే F3 కూడా త్వరలోనే ఓటీటీలో వస్తుంది. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు అనుకున్న వారికి డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా ఇద్దరు హీరోలు బిగ్ షాకిచ్చారు. ఇప్పట్లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేదని చెప్పేశారు.