Venkatesh - Nuvvu Naaku Nachav@20Years : వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్, సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు హైలెట్‌గా నిలిచాయి. తెలుగులో కల్డ్ కామెడీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలై 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు.. (Twitter/Photo)
‘నువ్వే కావాలి’ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు విజయ భాస్కర్, రచయత త్రివిక్రమ్ పనితనం నచ్చి .. నిర్మాత స్రవంతి రవి కిషోర్ తన నెక్ట్స్ మూవీ కోసం ముందుగానే వీళ్లిద్దరికి అడ్వాన్స్ ఇచ్చారు. అలా వీళ్లిద్దరు కలిసి ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా కథను రెడీ చేసారు. ఈ స్టోరీ స్రవంతి రవి కిషోర్‌తో పాటు నిర్మాత సురేష్ బాబుకు నచ్చింది. (Twitter/Photo)