‘కొండపల్లి రాజా’ సినిమా తమిళంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘అన్నామలై’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. కానీ ఆ సినిమా హిందీలో జితేంద్ర, శతృఘ్న సిన్హా హీరోలుగా నటించిన ‘ఖుద్గర్జ్’ సినిమాకు రీమేక్. ఆ తర్వాత ఈ సినిమాను కృష్ణంరాజు, శరత్ బాబు హీరోలుగా ‘ప్రాణ స్నేహితులు’గా తెరకెక్కింది. అదే సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళంలో శరత్ బాబుతో కలిసి ‘అన్నామలై’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. (Twitter/Photo)
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేస్తో ‘సుందరాకాండ’ సినిమాను నిర్మించిన కేవివి సత్యనారాయణ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నగ్మా హీరోయిన్గా నటించింది. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్నే నమోదు చేసింది. మొత్తంగా కాంట్రవర్సీలతో మొదలైన ఈ సినిమా చివరకు మంచి ఫలితాన్నే అందుకుంది. (Twitter/Photo)