Venkatesh - Narappa: మీరే అసలైన హీరోలంటూ ’నారప్ప’ యానిమేటేడ్ ఫోటోస్ షేర్ చేసిన వెంకటేష్.. సోషల్ మీడియాలో వైరల్..

Venkatesh - Narappa | వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నారప్ప’. కరోనా కారణంగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటిటీ వేదికగా విడుదల చేశారు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా వెంకటేష్ ‘నారప్ప’ మూవీకి సంబంధించిన యానిమేటెడ్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.