Venkatesh | టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెంకటేష్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు యాక్షన్ చిత్రాల్లో నటిస్తూనే ఫ్యామిలీ చిత్రాలను చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక సీనియర్ టాప్ హీరోల్లో ఈయనకు మాత్రమే ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. తాజాగా తన అబ్బాయితో మల్టీస్టారర్ మూవీ చేయకపోయినా.. వెబ్ సిరీస్ చేసాడు. వీళ్లిద్దరు ఒక స్క్రీన్ పై చూడాలనుకునే అభిమానులకు కిక్ ఇచ్చారు.
ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు (Twitter/Photo)
గతంలో వీళ్లిద్దరు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరిందనే చెప్పాలి. ఈ వెబ్ సిరీస్‌ను మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. (Rana venkatesh)
వెంకటేష్, రానా రానా నాయుడు వెబ్ సిరీస్‌తో పాటు ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి ఇమేజ్‌కు తగ్గ కథ రెడీ అయినట్టు సమాచారం. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ’వెంకీ బాబాయి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇక వీళ్లిద్దరి కాంబోలో వచ్చే వెబ్ సిరీస్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. (Facebook/Photo)
మరోవైపు వెంకటేష్.. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో పూజా హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక ‘అనారీ’, ‘తక్దీర్వాలా’ తర్వాత వెంకటేష్ యాక్ట్ చేస్తోన్నమూడో హిందీ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఈ ఇయర్ ఈద్ పండగ రోజున విడుదల కానుంది. (Twitter/Photo)
దాంతో పాటు వెంకటేష్ ఇపుడు టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోతో ఓ మల్టీస్టారర్ మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. ఆ హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. ఐతే.. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో వెంకటేష్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. (Venkatesh/File/Photo )
దివంగత సీనియర్ హీరో కృష్ణంరాజుతో కలిసి ‘టూటౌన్ రౌడీ’లో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్. ఈ సినిమా హిందీలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘తేజాబ్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది హిందీలో సురేష్ ఓబెరాయ్ పాత్రను తెలుగులో కృష్ణంరాజు చేసారు. దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ఈ సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Youtube/Photo)
సీనియర్ ఎన్టీఆర్‌తో వెంకటేష్ ఓ చారిత్రక కథను చేద్దామనుకున్నా.. ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ సినిమా ఏదో కాదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాను అప్పట్లో అనౌన్స్ చేసినా.. అప్పటికీ ఎన్టీఆర్..రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. కానీ వెంకటేష్.. ఎన్టీఆర్‌తో నటించాలనుకున్న కోరికను ‘కలిసుందాం.. రా’లో గ్రాఫిక్స్ రూపంతో ఈ కోరిక నెరవేర్చుకున్నారు. (Twitter/Photo)
తన తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జునలతో మల్టీస్టారర్ మూవీ చేయలేకపోయిన వెంకటేష్. కానీ ‘త్రిమూర్తులు’ సినిమాలో ఓపాటలో తన తరం హీరోలైన బాలయ్య, చిరు, నాగ్‌లతో పాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు వెంకటేష్. ఇక ‘ప్రేమమ్’ సినిమాలో నాగార్జున, వెంకటేష్ నటించినా.. వీళ్లిద్దరు కలిసి ఉండే సీన్స్ మాత్రం లేవు. (Facebook/Photos)