Venkatesh Multistarers : గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. ఈ రూట్లోనే నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేసారు. ప్రస్తుతం తన అన్నయ్య అబ్బాయి రానా దగ్గుబాటితో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్గా షూటింగ్ కూడా ప్రారంభమైంది. రీసెంట్గా వెంకటేష్‌కు 61 ఏళ్లు కంప్లీటయ్యాయి. తాజాగా మరో క్రేజీ హీరోతో మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)
గతంలో వీళ్లిద్దరు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరబోతుంది. ఈ వెబ్ సిరీస్‌ను మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్నారు. (Rana venkatesh)
వెంకటేష్, రానా వెబ్ సిరీస్‌తో పాటు ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి ఇమేజ్‌కు తగ్గ కథ రెడీ అయినట్టు సమాచారం. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ’వెంకీ బాబాయి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ‘కృష్ణం వందే జగద్గురం’ లో రానాతో ఒక పాటలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన వెంకటేష్. (Facebook/Photo) ( Photo : Twitter)
సీనియర్ ఎన్టీఆర్‌తో వెంకటేష్ ఓ చారిత్రక కథను చేద్దామనుకున్నా.. ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ సినిమా ఏదో కాదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాను అప్పట్లో అనౌన్స్ చేసినా.. అప్పటికీ ఎన్టీఆర్..రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. కానీ వెంకటేష్.. ఎన్టీఆర్‌తో నటించాలనుకున్న కోరికను ‘కలిసుందాం.. రా’లో గ్రాఫిక్స్ రూపంతో ఈ కోరిక నెరవేర్చుకున్నారు. (Twitter/Photo)