చిరంజీవితో కలిసి సైరా సినిమా చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. చిరంజీవితో కలిసి సైరా నరసింహ్మారెడ్డి సినిమాను వీక్షించారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సైరా సినిమా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వెంకయ్యనాయుడు తమ నివాసంలో సినిమాను చూశారు. బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ.. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటస్ఫూర్తితో.. రూపొందించిన 'సైరా' చిత్రం బాగుందన్నారు వెంకయ్య నాయుడు. సైరా నరసింహ్మారెడ్డి మూవీని అద్భుతంగా తెరకక్కించారని చిరంజీవి, రామ్‌చరణ్‌ను ఆయన అభినందించారు.