Venkatesh Telugu Remakes | మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న వెంకీ మామ. రీసెంట్గా తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేసారు. ఇపుడు మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. (Twitter/Photo)
‘దృశ్యం 2’ సినిమాలో ట్విస్ట్‌లు, కథనం ప్రేక్షకుల్నీ కట్టిపడేశాయి. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నాడు అనేది కథ. సినిమాలో మీనా, మోహల్ లాల్ అదరగొట్టారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక అదే సినిమాను తెలుగులో వెంకటేష్ 2014లో రీమేక్ చేశాడు. దృశ్యం మాతృకను జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయగా.. తెలుగులో శ్రీప్రియ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.
ఇటీవల ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా లేటెస్ట్ దృశ్యం 2 ఫిబ్రవరి 19, 2021న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను తెగ ఆకట్టకుంటోంది. ఈ దృశ్యం 2 సినిమాను ఆషిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించాడు. (Drishyam 2 trailer)
‘ధ్రువనక్షత్రం’ చిత్రం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ చిత్రానికి రీమేక్. ఇదే కథతో బాలకృష్ణ హీరోగా ‘అశోక చక్రవర్తి’ సినిమా తెరకెక్కింది. బాలయ్య ‘అశోక చక్రవర్తి’ బాక్పాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిస్తే.. వెంకటేష్ ‘ధ్రువ నక్షత్రం’ సూపర్ హిట్టైయింది. ఇక బాలకృష్ణ అశోక చక్రవర్తి, వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం’ సినిమా ఒకే రోజు విడుదల కావడం విశేషం. (Youtube/Credit)