Vekantesh Drushyam 2 Remake: ’దృశ్యం 2’ సహా వెంకటేష్ తన సినీ ప్రయాణంలో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

Venkatesh Telugu Remakes | మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను Vekantesh Drushyam 2 Remake : తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న వెంకీ మామ. గతేడాది తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్‌ చేసారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా వెంకటేష్ మలయాళంలో మోహన్ లాల్‌ నటించిన ‘దృశ్యం 2’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ సినిమా ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘నారప్ప’ తర్వాత వరుసగా వెంకటేష్ నటించిన సినిమా ఓటీటీలో విడుదల అవుతోంది.