Chiranjeevi Vs Balakrishna (Veera Simha Reddy Vs Waltair Veerayya) (వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి) | ఆరేళ్ల విరామం తర్వాత చిరంజీవి,బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనడానికీ రెడీ అయ్యారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బాలకృష్ణ వీరసింహారెడ్డి ఒక రోజు గ్యాప్‌లో పోటీ పడుతున్నాయి. వన్ డే గ్యాప్‌లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ రెండింటిలో శృతి హాసన్ హీరోయిన్గా నటించడం మరో ప్రత్యేకత. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు టికెట్ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. (Balakrishna Chiranjeevi)
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఈ సినిమా టికెట్ రేట్స్ ఓ వారం పాటు రూ. 50 పెంచుకోవడానికి అనుమతులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్‌కు విజ్ఞప్తి చేశారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాల్తేరు వీరయ్యకు రూ. 25 టికెట్ రేట్ + GST పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాకు రూ. 20 +GST పెంపుకు అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ పెంపు అనేది 10 రోజుల పాటు ఉండనుంది. ఈ సినిమా కోసం రూ. 50 టికెట్ రేటు పెంచుకునేందుకు అనుమతులు కోరినా.. ఈ రెండు సినిమాలకు రూ. 20, రూ. 25 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. (Twitter/Photo)
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో బాలకృష్ణ, చిరంజీవి హీరోలుగా నటించారు. ఈ సినిమాల్లో ఇద్దరు పేర్లతో వీర కామన్‌గా ఉంటడంతో పాటు హీరోయిన్ శృతి హాసన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కామన్ ఉండటం గమనార్హం. ఇందులో వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేటర్స్‌లో సందడి చేయనుంది. (Twitter/Photo)
ఐతే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో ఏపీ ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలు డైలాగులున్నాయి. పైగా బాలయ్య ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ ప్రత్యర్ధి టీడీపీ ఎమ్మెల్యే కూడా. ఒకప్పుడు జగన్.. బాలయ్య అభిమాని అయినా.. మారిన రాజకీయ పరిస్థితుల్లో అవేవి పట్టించుకోకుండా వీరసింహారెడ్డికి టికెట్ రేటు పెంచుకునే అనుమతులు ఇవ్వడం విశేషం(File/Photo)
మరోవైపు చిరంజీవి కూడా వైసీపీ ప్రత్యర్ధి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయాన అన్నయ్య. ఈయన జగన్‌తో సఖ్యతతో మెలుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ ప్రభుత్వ తీరుతో పాటు ఏపీ సీఎం జగన్‌ను పలు విషయాల్లో ప్రజా క్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు చిరు కూడా ఈ మధ్య కాలంలో తన తమ్ముడిని ఉన్నత స్థానంలో అంటే సీఎంగా చూడాలనుకుంటున్నాను అంటూ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్యకు సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇస్తారా అనే డౌట్స్ వచ్చాయి. కానీ నిర్మాతలు అడిగినట్టు ఓ పది రోజుల పాటు రూ. 50 కాకుండా.. బాలయ్య సినిమాకు 20 + GST, చిరు సినిమాకు రూ. 25+GST పెంచుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.
ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్.. ఆచార్య సినిమా దగ్గరకు వచ్చేసరికి పెరిగిన టికెట్ రేట్స్ కు అదనంగా రూ. 50 రూపాయలు పెంచడంతో తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా టికెట్ ధర 345 రూపాయలకు పెరిగింది. ఇక ఈ సినిమాకు బ్యాడ్ టాక్ రావడం.. పెరిగిన టికెట్ రేట్స్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేయాలంటేనే భయపడే స్థితికి వచ్చింది. ముఖ్యంగా థియేటర్స్ టికెట్ రేట్స్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేకపోవడం.. పైగా మల్టీప్లెక్స్ క్యాంటీన్లో తినుబండారాలు దిమ్మ తిరిగే రేట్స్ కామన్ ఆడియన్స్ థియేటర్స్ వైపు అడుగులు వేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. (Twitter/Photo)
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు కూడా రూ. 50 రూపాయలు అదనపు ఛార్జీలతో ఈ సినిమాను విడుదల చేసారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. పెరిగిన టికెట్ రేట్స్ కారణంగా బీ,సీ సెంటర్ ప్రేక్షకులు ఆ రేటు చూసి థియేటర్ వైపు అడుగులు వేయడానికి భయపడ్డారు. దీంతో అలర్ట్ అయిన దిల్ రాజు.. మా సినిమాకు టికెట్ ధర తగ్గించాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమా చూడొచ్చు అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ధరలు అంటే మల్టీప్లెక్స్‌లో రూ. 295 , మామలు థియేటర్స్‌లో రూ. 175 . ఈ రేట్స్ కూడా కామన్ ఆడియన్స్‌ను భయపెట్టేలా ఉన్నాయి. దీంతో ఎఫ్ 3 టాక్ తగ్గట్టు కలెక్షన్స్ లేవనే విషయం స్పష్టమైంది. అదే తక్కువ రేటుతో విడుదలైన ఎఫ్ 2 మూవీ తక్కువ రేటుతో ఎక్కువ వసూళ్లను సాధించిన విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి.
ఆర్ఆర్ఆర్ సినిమాను టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్న అది ఓ ప్రత్యేక సందర్భంలో చూసారు. దీంతో తత్త్వం బోధపడినట్టు.. ఆ తర్వాత విడుదలైన మేజర్, విక్రమ్ వంటి సినిమాలు మాములు రేట్స్‌తో మంచి హిట్ అందుకున్నాయి. ఏది ఏమైనా వీరిసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. వీటితో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఏ మేరకు లాభం పొందుతారనేది చూడాలి. ఏది ఏమైనా టికెట్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడటంలో నిర్మాతలు, హీరోలు చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపుడే థియేటర్స్ మనుగడ సాగించే పరిస్థితి ఉంటుంది. (File/Photo)