Balakrishna: నందమూరి బాలకృష్ణ ఆయన కెరీర్లో ఎన్నడు లేనంతగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతే ఆయన కెరీర్ ఫుల్ పీక్స్‌లో ఉంది. ఓ వైపు సినిమాలు .. మరోవైపు అన్‌స్టాపబుల్ షోతో దూసుకుపోతున్నాడు. తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. తాజాగా బాలయ్యకు మరో పురస్కారం వరించింది. వివరాల్లోకి వెళితే..
అతి చిన్న స్థాయి నుండి అత్యున్నత శిఖరాలు అందుకున్న వాళ్లలతో ఎల్.వి.ప్రసాద్ ఒకరు. సినీ రంగం నుంచి తాను సంపాదించిన డబ్బును చిత్ర పరిశ్రమ కోసం, కంటి వైద్యం కోసం ఖర్చు పెట్టిన మహనీయుడు అంటూ బాలయ్య ఎల్.వి.ప్రసాద్.. తెలుగు సినిమా కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్‌తో.. ఎల్.వి.ప్రసాద్ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మన దేశం చిత్రంతో చిత్ర పరిశ్రమకు నాన్న ఎన్టీార్ పరిచయం చేసింది ఎల్.వి. ప్రసాద్ అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. (Twitter/Photo)
ఆకృతి సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సలహాదారు కే.వి.రమణా చారి, బి.సి.కమిషన్ చైర్మన్ వకుళాభరం హాజరయ్యారు. వంద రూపాయాలతో ముంబాయి నగరంలో అనామకుడిగా అడుగు పెట్టిన ప్రసాద్ సినీ రంగంలో అనితర సాధ్యుడినిపించుకున్నాడు. ముంబై వీనస్ ఫిల్మ్ కంపెనీలో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా జీవితాన్ని ప్రారంభించిన ఎల్.వి. ప్రసాద్, శబ్ద చిత్రం "స్టార్ ఆఫ్ ది ఈస్ట్"లో చిన్న పాత్ర పోషించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా వకుళాభరణం, కే.వి.రమణా చారి మాట్లాడుతూ.. , ఎల్.వి.ప్రసాద్.. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వాళ్లన్నారు. వారిద్దరి వారసత్వాన్ని వాళ్ల కుమారులైన బాలకృష్ణ,రమేష్ ప్రసాద్ కొనసాగిస్గున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ టైమ్‌లో రామారావును వెండితెరకు పరిచయం చేసిన ఎల్.వి.ప్రసాద్ పురస్కారాన్ని బాలయ్య అందుకోవడం ప్రత్యేకమైన విశేషం అన్నారు. (Twitter/Photo)
బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డిగా పలకరించారు. ఈ చిత్రంలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. జైసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన 17వ చిత్రం. ఈయన చెల్లెలు కమ్ మేనత్త పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. (Twitter/Photo)
చిరంజీవి ,బాలకృష్ణ సమరసింహా రెడ్డి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి,సమరసింహా రెడ్డి,రాజశేఖర్,రాజశేఖర్ భరత సింహా రెడ్డి,భరతసింహారెడ్డి,సర్ధార్ చిన్నపరెడ్డి,అర్జున్ రెడ్డి,జార్జ్ రెడ్డి,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి,కడప రెడ్డమ్మ,జాంబీ రెడ్డి,వీరసింహారెడ్డి, బాలకృష్ణ వీర సింహా రెడ్డి,రెడ్డి టైటిల్స్ ట్రెండ్,వీరసింహారెడ్డి మూవీ రివ్యూ,వీరసింహారెడ్డి రివ్యూ,వీరసింహారెడ్డి సెన్సార్" width="1600" height="1600" /> ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరిసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. (Twitter/Photo)