Balakrishna - Samara Simha Reddy | నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమరసింహారెడ్డి’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కంటే ముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత దర్శకుడు బి.గోపాల్, హీరో బాలకృష్ణ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘సమరసింహారెడ్డి’, ఈ చిత్రం తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది. తాాజాగా ఈ సినిమా 24 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా తెరకెక్కడం వెనక పెద్ద కథే నడించింది. (Twitter/Photo)
‘సమర సింహారెడ్డి’ చిత్రం 13 జనవరి 1999న మిలినియం చివరి యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ రికార్డ్స్‌ను నెలకొల్పింది. అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ఈ మూవీ. అంతకు ముందు వెంకటేష్ ‘ప్రేమించుకుందాం ..రా’, ‘ మోహన్ బాబు ‘శ్రీరాములయ్య’ సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కినా.. ‘సమరసింహారెడ్డి’ మూవీ మాత్రం ఈ జానర్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
‘సమరసింహారెడ్డి’ సక్సెస్‌తో తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు క్యూ కట్టాయి. దాదాపు తెలుగులో అందరు హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నారు. ఒక రకంగా తెలుగులో ‘సమరసింహారెడ్డి’ ఫ్యాక్షన్ సినిమాల ఒరవడికి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్’ పతాకంపై చెంగల వెంట్రావు నిర్మించారు. (Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్లో తెరకెక్కిన హాట్రిక్ మూవీ కోసం రచయత విజయేంద్ర ప్రసాద్ నుంచి 30 కథలు విని.. ఫైనల్‌గా ఈ స్టోరీని ఫైనలైజ్ చేశారు. అప్పటి వరకు యాక్షన్, ఫ్యామిలీ స్టోరీలనే ఆదరించే ప్రేక్షకులు.. ‘సమరసింహారెడ్డి’ మూవీ ఆదరించారు. 1999 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. (Twitter/Photo)
‘సమరసింహారెడ్డి’ కథను విజయేంద్ర ప్రసాద్.. తన శిష్యుడైన రత్నంతో కలిసి రెడీ చేశారు. ముందుగా ‘సింధూర పువ్వు’ సినిమాలోని కాన్సెప్ట్‌ను తీసుకొని.. దానికి రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో పాటు మహాభారతంలోని విరాట పర్వంలోని భీముడి పాత్రలా హీరో పాత్రను తీర్చిదిద్దారు. ఈ మూవీలో అప్పటికే హిట్టైన రజినీకాంత్ ‘భాషా’ పోలికలు కూడా కనిపిస్తాయి. అక్కడ హీరో.. డాన్ అయితే.. ఇక్కడ హీరో రాయలసీమ ప్రజలు ఆరాధించే నాయకుడు కావడం విశేషం.
ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్ చెప్పిన ‘నేను గట్టిగా తొడ చరిచానంటే ఆ సౌండ్ కే గుండే ఆగి చచ్చిపోతావు’ అనే డైలాగ్‌తో పాటు నీ ఊరు వచ్చా.. నీ ఇంటికి వచ్చా.. నీ నట్టింటికీ వచ్చా అంటూ బాలయ్య చెప్పే డైలాగులతో పాటు.. ఈ సినిమాలో విలన్‌గా నటించిన జయప్రకాష్ రెడ్డి చెప్పినా.. సమర సింహారెడ్డి.. ఢిల్లీ వీధుల్లో కాదు.. సీమ సందుల్లో రారా.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో అన్న డైాలాగులు సూపర్ హిట్‌గా నిలిచాయి. మొత్తంగా ఈ సినిమాలోని డైాలాగుల గురించి ఎంత చెప్పినా.. తక్కువే. (Twitter/Photo)
దాదాపు రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 17 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఇక ఈ చిత్రంలో ఎలాంటి లవ్ ట్రాక్ లేకుండా తెరకెక్కించారు. ముందుగా ఈ సినిమాలో సిమ్రాన్ ప్లేస్‌లో రాశీని అనుకున్నారు. కానీ ఆమె సీతాకోక చిలుక సన్నివేశానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ప్లేస్‌లో సిమ్రాన్ వచ్చి చేరింది. ఇక సిమ్రాన్‌తో బాలయ్యది హిట్ కాంబినేషన్. ఆ తర్వాత రాశీతో బాలయ్య.. కృష్ణబాబు సినిమాలో నటించారు. (Twitter/Photo)
సిమ్రాన్ కాకుండా అంజలా ఝవేరి, సంఘవి మిగతా హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాతో బాలయ్య సినిమాలో ముగ్గురు హీరోయిన్ల ట్రెండ్ మొదలైంది. సమరసింహారెడ్డి’ చిత్రం మూడు టాకీస్‌లలో 227 రోజులు నడిచింది. 29 కేంద్రాల్లో 175 రోజులతో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. 122 కేంద్రాల్లో 50 రోజులు.. 73 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుని ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. (Twitter/Photo)
అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా బాలయ్యను అనుకోలేదట. ముందుగా ఈ సినిమా స్టోరీని దర్శకుడు బి.గోపాల్ .. వెంకటేష్‌కు వినిపించారట.అప్పటికే బి.గోపాల్ .. వెంకటేష్‌తో ‘రక్త తిలకం’, ‘బొబ్బలి రాజా’, చినరాయుడు’ సినిమాలు తెరకెక్కించారు. అందులో రక్త తిలకం సినిమా హిట్‌గా నిలిస్తే.. ‘బొబ్బలి రాజా’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘చినరాయుడు’ మాత్రం యావరేజ్‌గా నిలిచింది.
ఇక దర్శకుడు గోపాల్ కథ విని వెంకటేష్.. స్టోరీ చాల ా బాగుంది. ఈ స్టోరీని ఎవరైనా మాస్ హీరో చేస్తే బాగుంటుందని వెంకీ సలహా ఇచ్చారట.నాకు ఈ కథ సెట్ కాదు. నా కన్న మాస్ ఇమేజ్ ఎక్కువ ఉన్న హీరోతో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. దీంతో బి.గోపాల్ , బాలకృష్ణను కలిసి కథ వినిపించడం, ఆయన ఓకే చేసేయడం ఈ సినిమా పట్టాలెక్కడం అన్ని చకచకా జరిగిపోయాయి. ముందుగా ఈ సినిమాకు ‘సమరసింహం’ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు బి.గోపాల్, రచయత పరుచూరి గోపాల కృష్ణ సలహా మేరకు ‘సమరసింహారెడ్డి’గా మార్చారు. (Twitter/Photo)
ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి’ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేష్లో ‘నరసింహనాయుడు’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చివరగా వీళ్ల కాంబినేషన్లో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా వచ్చింది. (Twitter/Photo)