మలయాళీ అందం హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్యసరసన నటించనుందని తెలుస్తోంది. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించిన ఈ భామకు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బాలయ్య తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా హనీరోజ్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది.Photo : Instagram
హానీ రోజ్ విషయానికి వస్తే.. బాలయ్య లేటెస్ట్ సినిమా వీరసింహారెడ్డిలో మీనాక్షి పాత్రలో తన అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. ఈ భామ కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హానీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది. Photo : Instagram
హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram
హానీరోజ్ 2005లో 14వ ఏట తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో హనీ రోజ్ నటించింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో హానీరోజ్ నటించింది. హానీరోజ్ మొదటి తమిళ చిత్రం ముధల్ కనవే. Photo : Instagram
వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో.. ఇక బాలయ్య వీరసింహారెడ్డి విషయానికి వస్తే.. Photo : Instagram
అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 12న భారీగా విడుదలైంది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో కేక పెట్టించిన బాలయ్య సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. Photo : Instagram
ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు ఫస్ట్ డే 29 కోట్ల షేర్ వస్తే.. 50 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సినిమాకు ప్రీ సేల్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. వీటికి తోడు కొన్ని మాస్ ఏరియాలో కూడా ముఖ్యంగా రాయలసీమ, నైజాంలో ఊహకందని ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. దీంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము దులిపింది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా 14కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి విడుదలైన ఎనిమిది వారాలకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. Photo : Instagram
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హానీ రోజ్ నటించారు. సినిమాలో కంటెంట్ ఎక్కువగా మాస్కు అప్పీల్ అవ్వుతుండడంతో బి,సి సెంటర్స్‌లో వీరసింహారెడ్డి అదరగొట్టనుంది. చూడాలి మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో రానున్నాయో.. Photo : Instagram
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 15 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 13 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 9 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 5.2 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 5 కోట్లు.. గుంటూరు.. రూ. 6.40 కోట్లు.. కృష్ణ.. రూ. 5 కోట్లు.. నెల్లూరు .. రూ. 2.7 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 61.30 కోట్లు.. కర్ణాటక .. రూ. 4.50 కోట్లు.. రెస్టాఫ్ భారత్ .. రూ. 1 కోటి.. ఓవర్సీస్.. రూ. 6.2 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 74 కోట్ల షేర్ రాబట్టాలి. Photo : Instagram
ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. Photo : Instagram
ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి.. చూడాలి మరి ఈ సినిమాల్లో సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలవనున్నారో.. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో బోయపాటీ శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. డిసెంబర్ 2, 2021లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. Photo : Instagram
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ, ప్రధాన పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా 21 జనవరి 2022 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే అఖండ ఇప్పుడు హిందీలో భారీగా విడుదలకానుంది. ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు పెన్ స్టూడియోస్ ఈ సినిమాను అక్కడ భారీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. Photo : Instagram